దేవుడే ప్రత్యక్ష మైతే మీరు
ఏ వరాలు కోరుకుంటారు ?
మరుజన్మంటూ ఉంటే
ఏలా పుట్టాలనుకుంటారు ?అడిగాడు తిండ్రి
తన ముగ్గురు కొడుకుల్ని...
మొదటి కొడుకు కోరికలచిట్టా...
దేవుడే ప్రత్యక్ష మైతే...
నాకు పెద్దమేడలు మిద్దెలు కావాలని
తరతరాలకు తరగని ఆస్తులుకావాలని
ఏరోగాలులేని రోజులను దయచేయమని
ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగం ఇవ్వాలని
వ్యాపారంలో ముఖేష్ అంబానీలా రాణించాలని
ఖరీదైన ఇంద్రభవనంలాంటి ఇళ్ళుకట్టుకోవావాలని
అన్ని కోరికలు తీరిస్తే కొండపై కొచ్చి తలనీలాలిచ్చి
కోటి కొబ్బరికాయలు కొడతానని కోరుకుంటా...
రెండవ కొడుకు కోరికలు...
దేవుడే ప్రత్యక్ష మైతే...
ఆకాశంలో ఎగిరే ఒకక్షిగానో
అడవిలో స్వేచ్ఛగా విహరించే ఒక జంతువుగానో
పెరటిలోనో తోటలోనో పెరిగే ఓ పచ్చగాచెట్టుగానో
సముద్రంలో హాయిగా జీవించే ఒక జలచరంగానో
పుట్టేకన్నా తానే "విశాలమైన ఒక అడవిగా"
"లోతైన ఒక సముద్రంగా" పుట్టాలనికొరుకుంటా...
మూడవవాడు కోరిన "ఒకే ఒక్క చిన్న కోరిక"...
దేవుడే ప్రత్యక్ష మైతే...
తాను చిన్ననాడు ఎక్కి ఆడుకున్న ఆ
భుజంమీద రోజు పొలానికి మోసుకుపోతూ
దుక్కిదున్ని సేద్యంచేసి పచ్చని పంటలు పండించి
అందరికి ఆకలిని తీర్చే "నాన్న భుజంపైన నాగలిగా"
పుట్టి "నాన్న ఋణం" తీర్చుకోవాలని కోరుకుంటా...



