Facebook Twitter
ఈ హైకోర్టులో,ఆ పైకోర్టులో

సహనం,సమానత్వం

మంచితనం,మానవత్వం

"అన్ననాలుగు"... సద్గుణాలున్న 

ఏవ్యక్తి ఐనా 

మంచివాడే,మహాత్ముడే

 

మొండితనం, మోసకారితనం

అహంకారం, ఆశబోతుతనం

అన్నమాట తప్పడం 

అబద్దాలు చెప్పడం

"అన్నఐదు"...అవలక్షణాలున్న

ఏ వ్యక్తి ఐనా 

సంస్కారహీనుడే,

దుష్టుడే, దుర్మార్గుడే, 

ముష్టివాడే, పాపిష్టివాడే

 

ఐతే, తప్పుడు సాక్ష్యం చెప్పి

నేడు ఈ హైకోర్టులో తప్పించుకున్నా

రేపు పై కోర్టులో ఆ భగవంతుని ముందు 

ఒక దోషిగా, ఒక ద్రోహిగా నిలబడక తప్పదు 

చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటి ఒప్పుకోక తప్పదు

గరుడపురాణంశిక్షలన్నీ...అనుభవించక తప్పదు