గు- రు- వు అన్న ఆ మూడు అక్షరాల్లో
బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులున్నారు
అందుకే గురువులు దైవసమానులన్నారు
పాలుపట్టి నీ కడుపునింపి
మంచిమాటలతో నీ మనసునింపి
"ఆకలిపాఠాలు"నేర్పిన"
ఆ అమ్మ ఋణం"తీర్చలేనిది
నీ వేలు పట్టి నీవు కింద పడిపోకుండా
భద్రంగా నీతో అడుగులు వేయించి
నీకు"ప్రపంచపాఠాలు"నేర్పిన"
ఆ నాన్నఋణం"తీర్చలేనిది
నీకు ప్రాణం పోసి నీకీ ఉత్కృష్టమైన
మానవజన్మను ప్రసాధించి, అదృశ్యంగా
నీకు "ఆథ్యాత్మిక పాఠాలు" బోధించిన "
ఆ పరమాత్మ ఋణం" తీర్చలేనిది
విద్యార్థిగా నీకు అనంత జ్ఞానాన్ని అందించి
నిన్ను సంపూర్ణమైన సంఘజీవిగా తీర్చిదిద్ది
నీకు "అమూల్యమైన జీవితపాఠాలు"నేర్పిన
ఆ "గురువుఋణం" కూడా తీర్చలేనిదే
ఎందుకంటే,
నీవు సకలశాస్త్రాలు ఔపాసనపట్టినా
నీవెంతటి పండిత ప్రకాండుడివైనా
నీ గురువుకు నీ వెప్పుడూ శిష్యుడవే
నీ గురువుకు నీవెప్పుడూ గురువు కాలేవు కాబట్టి
ఇది జన్మజన్మలకైనా తెగని ఋణానుబందం కాబట్టి



