Facebook Twitter
గురుదక్షిణ

ఓ గురుదేవుళ్ళారా !

ఎవరైనా ఎలాగైనా

బ్యాంకులో తీసుకున్న

కోట్లరుణాన్ని ఈజన్మలో తీర్చుకోవచ్చు

కాని ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనిది

ప్రాణం పోసిన ఆ బ్రహ్మ ఋణం

జన్మనిచ్చిన అమ్మానాన్నల ఋణం

మాకు జ్ఞానామృతం పంచిన మీ ఋణం

 

అందుకే ఓ గురుదేవుళ్ళారా !

మీకు రెండు చేతులెత్తి మొక్కుతాం

మీ పాదాలకు పాలాభిషేకం చేస్తాం

మా గుండెల్లో గుడి గట్టి 

గురు బ్రహ్మ గురు విష్ణుః 

గురుదేవో మహేశ్వరాః

గురుసాక్షాత్ పరబ్రహ్మ 

తస్మై శ్రీ గురువేనమః అంటూ,మిమ్మల్ని

దైవాలుగా ప్రతినిత్యం పూజిస్తాం

మా బిడ్డలకు మీ పేర్లే పెట్టుకుంటాం

ఇదే మీకు మా గురుదక్షిణ

ఇంతకుమించి ఇంకేమిచ్చి

మీ ఋణాన్ని తీర్చుకోగలం, చెప్పండి

అందుకే ఓ గురుదేవుళ్ళారా ! మీకు 

వందనం ! అభివందనం ! పాదాభివందనం !!