Facebook Twitter
వ్యక్తి వెనుకనున్న శక్తి ?

ఓ అదృశ్యశక్తి ప్రేరణతో

దివ్యమైన తేజస్సు కలిగిన

ఓ వ్యక్తిలో నిద్రాణమైవున్న

ఆ ప్రచండమైన అఖండమైన

అనంతమైన అతీంద్రియశక్తి

 

చూసిన ఓ చూపులో నుండి

పలికిన ఓ పలుకులో నుండి

చాచిన అభయహస్తం నుండి

 

ఒక అయస్కాంతశక్తిలా

ఒక విద్యుత్ తరంగంలా

ఒక జీవనదిలా ఒక సునామిలా

ఎన్నో వేల మైళ్ళదూరం నుండి

అదృశ్యంగా ప్రవహిస్తూ వస్తుంది

ప్రతిఒక్కరిని ప్రభావితం చేస్తోంది 

 

ఆ ప్రభావానికి లోనైన 

అందరి జీవితాల్లో అనూహ్యంగా 

కలనైనా ఊహించని పెనుమార్పులే

మోడువారిన

ఓ చెట్టు మళ్ళీ చిగురించినట్లుగా...

ఎండిపోయిన

ఓ చెరువు నీటితో నిండిపోయినట్లుగా...

వాడిపోయిన

ఓ పువ్వు మళ్ళీ గుబాళించినట్లుగా...

మూగబోయిన

ఓ వీణ మధురరాగాలు పలికించినట్లుగా...

ఆ అతీంద్రియశక్తికి ప్రతిరూపమే ఆ పరమాత్మ