దైవ దర్శనం...
"రాత్రిపూట"
స్వప్నంలో దైవాన్ని
దైవమందిరాన్ని
తిలకించిన చాలు
పులకించిపోతాం...
పరమానందముతో
పరవశించిపోతాం...
మెలుకువ రాగానే...
కళ్ళు తెరవగానే....
కమ్మనికల కరగగానే...
మనసు బాధతో కాసేపు
విలవిలలాడి పోతుంది
"పగటిపూట"
పవిత్ర దేవాలయంలో
ప్రదక్షిణలు చేయబోతున్న
గుడిలో పూజలు
నిర్వహించబోతున్న
దైవాన్ని దర్శించుకో
బోతున్నామన్న
ఊహరాగానే మనసు
ఉప్పొంగిపోతుంది
నిజానికి ఒక్కోసారి
అష్టకష్టాలు పడి
దైవసన్నిధి చేరి
సాక్షాత్తు ఆ దైవాన్ని
ప్రత్యక్షంగా దర్శించుకునే
భాగ్యం కలిగితే చాలు ఇక
మన బ్రతుకు ధన్యమైపోయినట్లే.....



