కష్టేఫలి....
జేబులో ధనంగా
శిరస్సున కిరీటంగా
కళ్ళల్లో కాంతిగా
గుండెల్లో తృప్తిగా
మెడలో మాలగా
చేతిలో జ్ఞాపికగా
వీపున శాలువగా
చేతుల్లో చప్పట్లుగా
అంతరంగంలో ఆనందంగా
ఆహుతులందరి స్పందనగా
శ్రేయోభిలాషుల అభినందనగా
మరిచిపోలేని మధురజ్ఞాపకంగా
జీవితంలో మిగిలి పొమ్మని
శ్రమజీవిలో ఐక్యమై పొమ్మని
ప్రతిఫలితానికి ఆ పరమాత్మ
ఇచ్చిన ఆజ్ఞ చేసిన శాసనం
అదే ప్రకృతిధర్మం అదే సృష్టిమర్మం
ప్రతిభకు జరగాలి పట్టాభిషేకం
కష్టజీవికి జరగాలి కనకాభిషేకం
పరమాత్మకు జరగాలి పాలాభిషేకం



