Facebook Twitter
దేవుడెక్కడ ? ఇదిగో ఇక్కడ ?

దేవుడెక్కడ? అంటూ...

యక్ష ప్రశ్నలు సంధించే వాడు...

"నాస్తికుడు"...నిరాశావాది

 

అదిగో దేవుడక్కడంటూ...

ఆకాశం వైపు చూపేవాడు...

ఆస్థికుడు..."ఆశావాది"

 

ఇదిగో దేవుడిక్కడంటూ...

తన గుండెగుడిని చూపేవాడు...

"నిజమైనభక్తుడు"...నిత్యసత్యాన్వేషి

 

నిజానికి కళ్లులేని ఏ కబోధియైనా

భగభగమండే ఆ భాస్కరున్ని ? క్షణమైనా

వీక్షించగలడా ?లేదే...కారణం. 

చుట్టూ కమ్ముకున్న చిమ్మచీకటే...

 

కళ్ళు మూసుకుని పాలుత్రాగే పిల్లి

కళ్ళముందే యజమాని నిలుచున్నా...

కాంచగలదా ? లేదే...

కారణం...పిల్లి కళ్ళు మూసుకుంది...

 

రెండు కళ్లున్న ఆ నాస్తికుడు

దైవమే ఎదుట ప్రత్యక్షమైతే...

దర్శించగలడా? లేదే...కారణం

వేలసూర్యుల ఆ అఖండ తేజస్సును

ఆ అగ్నిజ్వాలలను తట్టుకుని నారాయణున్ని

దర్శించేశక్తి ఈ నరుని నేత్రాలకెక్కడిది?

                                                    

ఔను కళ్ళకు కనిపించని

ఆ పరమాత్మను దర్శించాలంటే

మార్గమొక్కటే ఆ భగవంతుడిపై

అవని అంత...ఆశైనా వుండాలి

విశ్వమంత...విశ్వాసమైనా వుండాలి

భక్తితో...శ్రద్ధతో...నిత్యం ఆరాధించాలి

నిరంతరం...నిష్టగా...ధ్యానం చేయాలి

                                                      

ఆ ధ్యానంతో...ఆ దివ్యజ్ఞానంతో.‌‌..

ఆ "పరమాత్మదర్శనం" సాధ్యమే...

ఇది ఎవరూ కాదనలేని నగ్నసత్యమే...