Facebook Twitter
చింతకాయ చింతకాయ ఎంతమాయ

ఔను నేను

ఒక చింతకాయను తింటూ ఉంటే...

నా చుట్టూరా కూర్చున్న

మీరా చింతకాయను చూస్తూ ఉంటే...

 

మీనోట్లో తప్పక ఊరి తీరుతుంది 

లాలాజలం ఔరా ఇదెంతటి మాయాజాలం

ఔను ఇది ఎవరు కాదనలేని పచ్చినిజం...

 

అందుకే ఆ చిరుచింతకాయలోనే

అంతటి మహాశక్తే' దాగి ఉంటే, ఇక

ఈ అనంతమైన విచిత్రమైన,వింతైన,

ఈ సకలచరా సృష్టికి కారణభూతుడైన 

అఖండజ్యోతియైన ఆ పరమాత్మలో......

ఇంకెంతటి అద్భుతమైన శక్తి దాగిఉందో...

 

మన ఆలోచనలను పసికట్టగల

మన కష్టాలను తెలుసుకోగల

మన కన్నీళ్లను తుడువగల

మన కలలను పండించగల

మన కోరికలను ఆశలను తీర్చగల

ప్రమాదపు అంచులనుండి తప్పించగల

మృత్యువు కోరలనుండి రక్షించగల

ఇంకెంతటి "అఖండమైన" 

అపారమైన అంతుచిక్కని

అతీంద్రియశక్తి దాగిఉందో కదా....