Facebook Twitter
అమ్మా ఓ ధనలక్ష్మీ.?

నన్ను "అమ్మంటే" చాలు

ప్రేమతో ఇంటికి "రమ్మంటే" చాలు 

వచ్చి మీకు కంచెనౌతా 

మీరు తినే కంచాన్నౌతా

మీ కుటుంబానికి రక్షణ కవచాన్నౌతా

మీ గుండెల్లో కొండంత ధైర్యాన్నౌతా 

 

నన్ను "అమ్మంటే"చాలు

ప్రేమతో ఇంటికి "రమ్మంటే" చాలు 

మీకు జరగరాని దేదైనా జరిగి 

మీ కుటుంబమంతా అతలాకుతలమైతే 

మీ కన్నీళ్ళుతుడుస్తా మీ ఆకలితీరుస్తా 

మీ ఆర్థిక అవసరాలన్నీ క్షణంలో తీరుస్తా 

మిమ్మల్ని అందరిని ఆపదలో ఆదుకుంటా 

 

నన్ను "అమ్మంటే" చాలు

ప్రేమతో ఇంటికి "రమ్మంటే" చాలు 

నా కొంగున కోట్లనిధులున్నాయి 

ఆహ్వానిస్తే అక్కున చేర్చుకుని ఆదరిస్తా

లాకర్లో బంధించినా సరే లక్షలు అందిస్తా 

 

కాదు అక్కర్లేదు "పొమ్మంటే" చాలు 

వెళ్లిపోతా "మళ్ళీ రమ్మంటే" ఇకరాను

 

నా పేరే "ధనలక్ష్మి" "సౌభాగ్యలక్ష్మి"  

నా మారుపేరే  "బ్యాంకు డిపాజిట్టు"

మీఇంట‌ మీవెంట నేనుంటే మీకెంతో బెట్టు

 

మరి నన్ను అమ్మంటారా?

నేడే మీ ఇంటికి రమ్మంటారా?

లేదు పొమ్మంటారా ఇక మీ ఇష్టం 

నేవస్తే కలిసి వస్తుంది మీకు అదృష్టం 

నేపోతే మాత్రం మీకు లక్షలుకోట్లు నష్టం