Facebook Twitter
ఆ పరమాత్మ‌ సందేశం...

అటు ఇటు చూడకండి

ఆకర్చితులౌతారు

నింగికో నేలకో చూడకండి

నిరాశకు గురౌతారు

ఎదురుగా ఉన్న నన్నే ఏకాగ్రతతో చూడండి

నిదురపోతారు హాయిగా నిశ్చింతగా చిన్నపిల్లల్లా

 

నన్ను నమ్మండి నన్ను ప్రార్ధించండి

నా వైపే చూడండి ,నా దగ్గరికి రండి

నా వెనుకే నడవండి, నాపైనే భారం మోపండి

చెంతకు చేరితే చెట్టు మీకు నీడనిస్తుంది 

మీ కడుపు నింపుతుంది, మిమ్ము కాపాడుతుంది

మీరూ నా వద్దకు వస్తే ఉద్దరింపబడతారు

ఉన్నత స్థితికి చేరుకుంటారు...సందేహం లేదు

 

మీ బ్రతుకు ఉజ్వలంగా ఉంటుంది

మీ జీవితమంతా విజయవిహారమే

మీరు ఖుషీగా, కులాసాగా ఉంటారు 

మీరు ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో వర్ధిల్లుతారు

మీ ఇంటికి సిరిసంపదలు, వరదలా వచ్చిపడతాయి

మీరు సుఖశాంతులతో,ఉల్లాసంగా,ఉత్సాహంగా వుంటారు

 

మీ జీవితమెంతో, ప్రశాంతంగా గంగానది ప్రవాహంలా

నిర్మలంగా, నిశ్చలంగా, హ్యాపీగా,సాఫీగా సాగిపోతుంది

మీ జీవితనావ ఏ ఆటుపోట్లకు గురికాకుకుండా

ఏ అడ్డంకులు లేకుండా ఆవలితీరం అవలీలగా చేరుతుంది

ఓ నా భక్తులారా...నామాట వినండి...నన్ను సేవించండి...