Facebook Twitter
భగవంతుడే తోడుంటే భయమేల? భయమేల భగవంతుడే తోడుండగా ?

 

ట్యాప్ తిప్పితే నీళ్లొస్తాయి 

నిజమే ట్యాంక్ లో - నీళ్లుండాలి

 

స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుంది 

లైటెలుగుతుంది నిజమే - కరెంటుండాలి

 

మొండిరోగాలు నయమౌతాయి 

నిజమే మరిచిపోక  - మందులేసుకోవాలి

 

కొత్త కాపురంలో అలకలుండవు 

కలతలుండవు - కలహాలుండవు 

నిజమే ఆ ఇద్దరూ - కలిసి మెలిసి ఉండాలి

వారిలో ఇద్దరిలో ఐక్యత - సఖ్యత ఉండాలి 

 

పశువులు చిక్కని పాలిస్తాయి 

నిజమే పచ్చగడ్డి - వేయాలి అవి మేయాలి

 

విధిని ఎదిరించవచ్చు విజయం సాధించవచ్చు 

నిజమే మన గుండెలో - దమ్ము - ధైర్యముండాలి

 

ఎట్టి క్లిష్టపరిస్థితులనైనా ఎదుర్కోవచ్చు

నిజమే మనలో అంతులేని ఆత్మవిశ్వాసముండాలి 

 

విద్యార్థులు ఎట్టి పోటీపరీక్షలనైనా విజేతలు కావచ్చు

నిజమేగట్టిగా‌ శ్రద్ధగా ప్రణాళికాబద్ధంగా  - చదివుండాలి

 

మనం ఎన్ని బాధలనైనా, వ్యాధులనైనా వేదనలనైనా 

భరించవచ్చు ఆ భగవంతుడు - మనకు తోడుండాలి