పంజరంలోని పక్షికి
వేళకింత తిండి
దొరుకుతుంది అది
ఏ ప్రాణభయం
ఏ శత్రుభయం లేకుండా
కంటినిండ నిద్రపోతుంది
కాని అది స్వేచ్చలేని బ్రతుకు...
ఆకాశంలో ఎగిరేపక్షి
తిండికోసం ఎక్కడెక్కడో
తిరగాలి ఎంతో దూరమెళ్లాలి
తిరిగి గూడు చేరేవరకు
అడుగడుగునా గండాలే
అర్థంకాని సుడిగుండాలే.......
ప్రతిక్షణం ప్రాణభయమే
ఎవరు వల విసురుతారోనని
ఎక్కడ ప్రాణం తీస్తారోనని
కాని దాని స్వేచ్చ ఆకాశమంత...
చిన్న ఆక్వేరియంలోని చేపకు
వేళకింత మేతదొరుకుతుంది అది
ఏభయంలేక సుఖంగా ఉంటుంది
కాని అది స్వేచ్చలేని బ్రతుకు....
సముద్రంలో వున్న చేపకు
క్షణక్షణం ప్రాణభయమే
ఏ తిమింగలం మింగేస్తుందోనని
ఏ వలలో చిక్కుకొని, గిలగిలా
కొట్టుకోవలసి వస్తుందోనని
ఏ గాలానికో తగులుకొని
విలవిలలాడాల్చి వస్తుందోనని
కాని దాని స్వేచ్చ సముద్రమంత...
కానీ అర్థం కానిదొక్కటే
స్వేచ్చవున్న చోట సుఖంలేదు
సుఖమున్న చోట స్వేచ్చలేదు
ఏమీటో ఈ సృష్టి రహస్యం?
వెలుగెక్కడో...చీకటక్కడ
సుఖమెక్కడో...దుఃఖమక్కడ
జననమెక్కడో...మరణమక్కడో
స్వేచ్చఎక్కడో...ప్రాణభయమక్కడ
ప్రక్కప్రక్కనే వుంటాయి, కలిసే
వుంటాయి కానీ కంటికే కనిపించవు
ఏమీటో ఈ సృష్టి రహస్యం?



