Facebook Twitter
మతమా? మానవత్వమా?..

మొన్న అయోధ్యలో అల్లర్లురేపి

నిన్న భాగ్యనగరం నడిబోడ్డులో బాంబులుపేల్చి

శాంతిదూతయైన గౌతమబుద్దుని సాక్షిగా 

అమాయకుల్ని హతమార్చి అశాంతిని సృష్టించి

కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా 

నిత్యం ఆరనిమతచిచ్చు‌ను రగిలిస్తూ

రక్తపుటేరుల్లో స్నానం చేసే ఓ రాక్షసుల్లారా!

 

ఎవరు ముస్లిం? ఎవరు హిందువు ?

ఎవరు క్రిస్టియన్ ? ఎవరు సిక్కు ?  

ఎవరిచ్చారు మీకీ ప్రజాస్వేచ్చను హరించేహక్కు?

 

క్షమకు కరుణకు ప్రేమకు ప్రతిరూపమైన

ఆ క్రీస్తు కోరునా కిరాతకం... లేదే

శత్రువులు చేజిక్కినా ఏహాని తలపెట్టని

ఆ రఘురాముడు కోరునా రక్తాభిషేకం... లేదే

యుద్దమంటే జీవహింసని ప్రజల రక్తప్రవాహమని

శాంతిని ప్రభోదించిన ఆ అల్లా కోరునా అల్లకల్లోలం...లేదే

 

మరి జీహాదేమిటీ ? 

జీహాద్ పేర ఈ జీవహింస ఏమిటి ?

మతంపేరిట ఆ మారణహోమమేమిటి ?

 

నిన్నమతం ...ఒక మత్తుమందు...

నేడు ఆపేరు...ఎత్తితేనే రక్తం చిందు... 

మతంమత్తులో జోగే ఓ మతోన్మాదుల్లారా!

మీకిదే నా శాంతిసందేశం ...గుర్తుంచుకోండి

 

మనకు కావలసింది మతంకాదు మానవత్వం మనం

మనిషిలో దర్శించాల్సింది దానవత్వం కాదు దైవత్వం

మన సుఖజీవన సూత్రం భిన్నత్వంలో ఏకత్వం 

అది ఒక్క మతసామరస్యంతోనే సాధ్యం ఇది నగ్నసత్యం

మతసామరస్యమే ఈమట్టిమనిషి పురోగతికి గట్టిపునాది