సహాయమందించే సహృదయులు
మూడు రకాలు
మొదటి రకం
ఆపద అవసరం వచ్చీరాగానే
ఆర్ధికంగా వెంటనే ఆదుకునేవారు
రెండవ రకం
ధనసహాయం చెయ్యలేకపోయినా
ఒక మాట సహాయమైనా చేస్తారు లేదా
ఒక మంచి సలహానైనా యిస్తారు లేదా సహాయం అందే
ఒక చక్కని దారినైనా చూపెడతారు
మూడవరకం
"మని"లేదు "మాట"లేదు
మన్నుతిన్నపాములా "మౌనంగా"
పిరికితనంగా పరధ్యానంగా
కదలని కరగని కఠినమైన "ఒక శిలలా"
ఉలుకూపలుకూ లేకుండా ఉంటారు
చేసే సహాయాలు రెండు రకాలు
ఒకటి మాట సహాయం
రెండు మని సహాయం
మాట సహాయంచేయాలంటే
మంచి మనసుండాలి
ధన సహాయం చేయాలంటే మాత్రం
దయార్ద్రహృదయముండాలి
దైవభీతి ఉండాలి
గుండెళ్ళోజాలి ఉండాలి
కరుణామయుడై ఉండాలి
కరిగే హృదయ ముండాలి
ధైర్యముండాలి దాతైవుండాలి
పేదలంటే ప్రేమ వుండాలి
ఉన్నది పరులకు పంచే
ఉత్కృష్టమైన మంచి గుణముండాలి
ఎదురు చెప్పని భార్య వుండాలి
ఎముకలేని చెయ్యి వుండాలి
అప్పుడేగా దాతలుగా మారేది
దాతలేగా దారిచూపే దీపాలు
దాగివున్న ఆ దైవానికి ప్రతిరూపాలు



