Facebook Twitter
విశ్వంలో (10) వింతలు...?

లంకాధిపతి...
రావణ బ్రహ్మకు తలలు...(10)...

ఖగోళంలో నవగ్రహాలు...(9)...
బుధుడు...శుక్రుడు...భూమి
కుజుడు...(అంగారకుడు)
బృహస్పతి...(గురుడు)
శని...యురేనస్...
నెప్ట్యూన్...‌ప్లూటో...

రాయల రాజ్యంలో ఆస్థాన
కవులు...ఎనమండుగురు...(8)...
ధూర్జటి...
నంది తిమ్మన...
పింగళి సూరన...
అల్లసాని పెద్దన...
మాదయ్య గారి మల్లన...
(కందుకూరి రుద్రకవి)
తెనాలి రామకృష్ణుడు...
రామ రాజ భూషణుడు...
(భట్టుమూర్తి)
అయ్యల రాజు రామభధ్రుడు...

సంగీతంలో సప్త స్వరాలు...(7)...

(స...రి...గ...మ...ప...ద...ని...సలు)

మన అంతరంగాన బద్ద
శత్రువులైన అరిషడ్వర్గాలు...(6)...
(కామ...క్రోధ...లోభ...
మోహ...మద...మాత్సర్యాలు)

ప్రకృతిలో పంచభూతాలు...(5)...
(గాలి...నీరు...పృథ్వి...అగ్ని...ఆకాశం)

దిక్కులు...(4)...
(తూర్పు...పడమర...ఉత్తరం...దక్షిణం)

త్రిమూర్తులు...(3)...ముగ్గురు
(బ్రహ్మ...విష్ణు...ఈశ్వరుడు...)

ఈ సృష్టికి మూలం...(2)...ఇద్దరు
(ఆడ...మగ...)

ఈ చరాచర జగతికి సృష్టికర్త...(1)...
ఒక్కరే ఆ పరమేశ్వరుడు