Facebook Twitter
సప్తస్వరాల నిజస్వరూపం..?

సరస్వతీ మాతకు
సంగీత విద్వాంసులు
సాహితీ సార్వభౌములు
సంగీత సాహిత్య
సమలంకృతే...అంటూ
రమణీయమైన రాగాలాపనలతో
అర్చనలు అక్షరాభిషేకాలు చేస్తారు

సంగీతం ఒక మహాసాగరం
అలరించే అలల సవ్వడులే
సప్త స్వరాల సమ్మేళనం...(7)

వీనుల విందుగా
వినిపించే వింత వింత
భిన్న ధ్వనుల ఏకత్వమే
స...రి...గ...మ...ప...ద...ని...
అన్న సప్త స్వరాల సంగీత ఝరి...

స...షడ్జమం......(నెమలి కూత)
రి...రిషభం........(ఎద్దు రంకె)
గ...గాంధారం....(మేక అరుపు)
మ...మధ్యమం..(క్రౌంచ పక్షి స్వరం)
ప...పంచమం....(కోకిల గానం)
ద...దైవతం.......(ఏనుగు ఘీంకారం)
ని...నిషాదం......(గుర్రపు సకిలింపు)

ఈ జగతిలో మనిషి జీవితాన్ని
ప్రభావితం చేసేవి...
ప్రకాశింప చేసేవి...
రంజింప జేసేవి...
రసమయం చేసేవి...
వినోదాన్ని పంచేవి...
విస్మయం కలిగించేవి...
ఏడడుగులు...
ఏడు స్వరాలు...
ఏడు రంగుల ఇంద్రధనుస్సు...