Facebook Twitter
వాడు భయంకరుడు యమకింకరుడు...?

మొద్దు గొడ్డలిచ్చి
మూడొందల చెట్లను
నాలుగు గంటల్లో
నరకమనేవాడు...
అవివేకి అజ్ఞాని...
యమకింకరుడు...
అతి భయంకరుడు...

బ్రతకాలని
ప్రార్దిస్తూనే
మరణించేందుకు
మందులిచ్చేవాడు
పచ్చిమోసగాడు...
పరమ కిరాతకుడు...

చీకటి గదిలో
చిరుత పులిని దాచి
చిరునవ్వు నవ్వుతూ
ముప్పేమిలేదంటూ
ముందుకు నెట్టేవాడు
మూర్కుడు...నరహంతకుడు...

దాహం...
దాహమంటుంటే
చేతిలో నీళ్ళకు బదులు
నిప్పులు పోసేవాడు
పరమ నీచుడు
నిక్రుష్టుడు...నయవంచకుడు...

ఆకలి...
ఆకలంటుంటే
అరిటాకేసి
అన్నానికి బదులు
సున్నం పెట్టేవాడు
పరమ పిసినారి...పిచ్చోడు...

అవతలివాడు
దగ్గు తున్నాడని
అది కరోనా కావొచ్చని
తనకు సోకవొచ్చని
అతి భయంతో
అనుమానంతో
కాల్ కట్ చేసేవాడు
పరమ పిరికివాడు...వెర్రి వెంగళప్ప