Facebook Twitter
పర్యావరణ పరిరక్షణ...పచ్చదనం

భానుడి భగభగలు... 

నేల ఒక నిప్పుల కొలిమి... 

నింగి నుండి నిప్పులవాన...

పగబట్టిన సూర్యభగవానుడు... 

రోజంతా రోడ్లన్నీ నిర్మానుష్యం...

వడగాల్పులకు వృద్ధులు బలి...

మండేఎండలకు జనం విలవిల...

ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి... 

రోజురోజుకు ఉష్ణోగ్రత ఉగ్రరూపం... 

నిన్న పచ్చనిచెట్లు నేలకొరిగిపోయె...

నేడు భూతాపం ఒక భూతమాయె...

ఒకచోట చుర్రుమనే ఎర్రని ఎండలు... 

ఎడారుల్లో ముంచెత్తుతోన్న వరదలు...

వాతావరణంలో ఎంత వింత మార్పులు 

రేపీ ధరణిపై ప్రతిజీవికి ప్రాణసంకటమే

ఔను పర్యావరణ పరిరక్షణ...పచ్చదనం 

ఈ పుడమిపై ప్రతిఒక్కరి ప్రథమ కర్తవ్యం