Facebook Twitter
వారెవరు? రాక్షసులా?రక్షక భటులా?

చుట్టూ
ఉన్నారు సరే...వారు
వారు మేకవన్యపులులా..?
తేనేపూసిన కత్తులా..? గమనించాలిగా
నిద్రపోక...నిఘా పెట్టాలిగా...

చుట్టూ
ఉన్నారు సరే...వారు
నమ్మించి
నట్టేటముంచే
నయవంచకులా..?
తడిగుడ్డలతో గొంతులు కోసే
కసాయివారా..? గమనించాలిగా
నిద్రపోక...నిఘా పెట్టాలిగా...

చుట్టూ
ఉన్నారు సరే...వారు
వెన్నుపోటుదారులా..?
భజనపరులా..? గమనించాలిగా
నిద్రపోక...నిఘా పెట్టాలిగా...

చుట్టూ
ఉన్నారు సరే...వారు
రాక్షసులా...రక్షకభటులా
రాముని వారసులా..? గమనించాలిగా
నిద్రపోక...నిఘా పెట్టాలిగా...

చుట్టూ
ఉన్నారు సరే...వారు
కాటు వేసేవారా..?
కన్నీరు కార్చేవారా..?
కాటికి చేర్చేవారా..? గమనించాలిగా
నిద్రపోక...నిఘా పెట్టాలిగా...

చేతులు కాలాక
కొంప మునిగాక...
గంగలో ముంచాక..
ఇంటికి కన్నం వేశాక.
ఒంటినిండా వాతలు...
చెవిలో పువ్వు తలపై టోపీ పెట్టాక...
ఎంత గగ్గోలుపెట్టి మాత్రం ఏం లాభం...?