Facebook Twitter
వీధి పాలలు

వీధి బాలలు...
రెక్కలు తెగిన పక్షులు...
దారం తెగిన గాలిపటాలు...
వారే గూడు చెదిరిన గువ్వలు....

వీధి బాలలు...
విధి విసిరేసిన...
ఎంగిలి విస్తరాకులు...
వారే ముద్దొచ్చే ముద్దమందారాలు...

వీధి బాలలు...
కంటినిండా నిద్రలేని...
కడుపునిండా తిండిలేని...
ఒంటినిండా బట్టలేని దిక్కుమొక్కేలేని దీనులు...

వీధి బాలలు...
అమ్మానాన్నలు ఎవరో ఎరుగని అనాధలు...
ఆకలికి అలమటించిపోయే అస్థిపంజరాలు...
వారి బ్రతుకంతా అంధకారమే అగమ్యగోచరమే....

వీధి బాలలు...
ఏ బస్టాండుల్లోనో చెట్లకిందనో...
అర్థాకలితో ఆదమరిచి నిద్రపోయే అభాగ్యులు...
వారికి ఆకలి ఆత్మబంధువు దారిద్య్రం దగ్గరి బంధువు...

వీధి బాలలు...
దుర్గంధం వెదజల్లే చెత్త కుప్పలమీద...
విసిరేసిన ఎంగిలి విస్తరాకుల్లో మిగిలిన మెతుకుల కోసం...
కుక్కలతో కుస్తీపట్టే పందులుతో
పోటీపడే విధివంచితులు...