చిత్ర కవిత...
ఆహా మిత్రమా
ఎంత శ్రావ్యమైన
మధుర స్వరాలు ఇద్దరివి...
దంపతులైతే వారి జన్మ ధన్యమే...
విన్న వారి మది పులకించిపోయేలా
ఎంతో అధ్భుతంగా...
ఎంతో తన్మయత్వంతో
గీతాన్ని ఆలపించారు...
అందరి గుండెల్లో
కార్తీక దీపాలు వెలిగించారు ...
వారివి అధ్భుత గళాలు...?
అందులో ప్రవహించింది
పవిత్ర గంగా జలాలు...?
ఆహా ఓ దైవమా
ఎంతటి గంభీరమైన
గొంతులనిచ్చావయ్యా
ఆ ఆదిదంపతులకు...
పాట వింటూ ఉంటే...
పాలు తేనెలు
ప్రవహిస్తున్నట్టుగా ...
అమృతపు చిరుజల్లులు
కురిసినట్లుగా ఉంది...
అందుకే అంటారు "స్వరాలు
గానగంధర్వులకు వరాలు" అని...
అవి వారికి ఆ భగవంతుడు
అందించే హారాలని...కంఠాభరణాలని...
అభినందనలు మిత్రమా మీకు
మంచి వీడియో షేర్ చేసినందుకు...



