Facebook Twitter
జాతకం ఒక జలపాతమైతే..?

అందమైన
సుందరమైన
అంత ఎత్తైన
అద్భుతమైన
ఆశ్చర్యకరమైన
అరవై అంతస్తుల
విలాసవంతమైన
ఖరీదైన ఆ చలువరాతి
ఇంద్ర భవనాన్ని ఆకాశం
అంచులను తాకేలా పైకి
లేపిన ఆ అదృశ్యహస్తాలలో...

ఉండొచ్చు...
ఒక బ్యాంకు లోన్ ...
ఉండొచ్చు... 
ఒక ఫైనాన్సియర్ హస్తం...

మార్చి ఉండొచ్చు...ఆ దైవం
ఆ భవంతి యజమాని
జాతకాన్ని ఒక జలపాతంగా...

ఆ అదృష్టవంతుడి
దశ తిరిగి ఉండొచ్చు...
శ్రమ ఫలించి ఉండొచ్చు ...
కన్నకల నిజమై ఉండొచ్చు...

కానీ...
ఏ‌ బిల్డింగ్ ఓనరైనా
విలాసవంతమైన ఆ
విల్లాల్ని చూసి విర్రవీగొద్దు...
ప్రక్కనున్న పూరిగుడిసెను
చూసి ఫక్కుమని నవ్వొద్దు...

విధి "ఓ విషపు నవ్వు"
నవ్విన వేళ...
ఓడలు బండ్లౌతాయని...
బండ్లు ఓడలౌతాయని...
చరిత్రలో చెక్కిన ప్రతిపుట
సముద్రపు అలలా ఘోషిస్తుంది...