చిత్ర కవిత
ఆహా..! ఓహో..!
ఏదో అధ్భుతం
ఆవిష్కృతం
ఔరా ఆ గీతం
ఆపాతమధురం
ఏమా మాధుర్యం...
ఎంతటి తన్మయత్వం...
ఔను సంగీతం
ఒక సంతోష సాగరం
ఆహ్లాదకరం ఆనందకరం
అంబరాన్ని తాకే సంబరం
విన్నంతసేపు మనసంతా
పట్టరాని పరవశమే...
ఉత్సాహమే ఉల్లాసమే...
ఏదో పూలఊయలలో
ఊగుతున్నట్లు ...
ఏదో స్వర్గంలోకంలో
విహంగమై మనసు
విహరించినట్లు ...
ఎవరో చెవుల్లో
చెక్కెర పోస్తున్నట్లు...
ఏదో లోకంలో
కాసేపు వీనులవిందుగా
విహారయాత్ర చేసినట్లు...
అనిర్వచనీయమైన
ఒక ఆనందానుభూతి...
రస స్వాదన స్వాంతన
నీ కళ్ళు చెబుతున్నాయి
నువ్ ప్రేమించావని...అన్నట్లు
నా చెవులు చెబుతున్నాయి రాగాలతో మనసు రంజిల్లునన్నది పచ్చినిజమని...



