Facebook Twitter
ఖాళీ వలలు...కరిగిన కలలు…

చెరువులో దిగి
స్వేదం చిందించి
పట్టుకొచ్చిన రొయ్యల్ని
తిరిగి నీళ్ళలోకి విసిరేశారు
చెరువు యజమాని జాలితో

గట్టున పడి
గిలగిల కొట్టుకోవలసిన ‌
కుండలో కమ్మని కూరగా
మారవలసిన రొయ్యలు
జాతకాలు మారి చెరువుకు చేరి
స్వేచ్ఛగా తిరుగుతున్నాయి
మీసాలు మెలిపెడుతున్నాయి

నేడు విలవిల లాడుతుంది
విషాదంలో మునిగింది
ఆకలితో నకనకలాడుతుంది
ఖాళీ వలలు చూసుకుని...
కరిగిన కలలు తలచుకొని...
కన్నీళ్లతో తిరిగొచ్చిన మత్స్య కారులే...