ఎందుకని...ఏమో...?
పక్షులకూ
పిల్లలుంటాయి
కాని ఏ పక్షి పాలివ్వదు
ఎందుకని... ఏమో...
జంతువులకు
కొమ్ములు వుంటాయి
కుక్క జంతువే
కాని కొమ్ములుండవు
ఎందుకని... ఏమో...
పక్షులకు
తోకలుంటాయి
ఈకలుంటాయి
నెమలి ఈకలే
అందమైనవి
అతిసుందరమైనవి
ఎందుకని... ఏమో...
కోడి రెండు రెక్కల పక్షి
కానీ పావురంలా కొంగలా
ఆకాశంలో విహరించలేదు
ఎందుకని... ఏమో...
గుర్రాలు జింకలు
శరవేగంగా పరుగులు
తీసే జంతువులు
పామూ జంతువే
కానీ పాదాలు లేకున్న
బుసలు కొడుతూ పొదల్లో
శరవేగంగా పరుగులు తీస్తుంది
ఎందుకని...ఏమో...ఎవరికెరుక..?
సృష్టించిన ఆ పరమాత్మకు తప్ప...
అందుకే...ఓ దైవమా...!
ఈ ధర్మసందేహాలు తీర్చుమా..!



