"దయ" అంటే...దైవమే
"దయ" ఉంటే...వారు
"దయామయులే"...
"దైవ స్వరూపులే"...
"దైవాంశ సంభూతులే"...
"దయా సర్వభూతేషు"
అన్నారు మన ఋషులు
సకల జీవులపట్ల దయ కలిగి
ఉంటేనే భగవంతుని అనుగ్రహం
ఆప్తుల కంటే అపరిచితులను
ఆదుకోవడమే..."పరిపూర్ణమైన దయ"ఆ
దయకు పునాది...నిస్వార్థమైన ప్రేమయే
ఎదుటి వ్యక్తి స్థానంలో
మనల్ని ఊహించుకొని
పరిస్థితిని అర్థం చేసుకొని
సకాలంలో స్పందించి తక్షణ
సహాయందించడమే..."సంపూర్ణ దయ" ఆ
దయకు ఆధారం..సద్బుద్ధి సానుభూతియే
పిల్లల పట్ల...ప్రేమగా...
మిత్రుల పట్ల...స్నేహంగా...
కన్నవారి పట్ల...కరుణగా...
గురువుల పట్ల...గౌరవంగా...
ఉన్న వారి జీవితం
ధన్యం...దయామయం
సార్థకం...సంతోషదాయకం...
ఆ దయ...మచ్చలేని మానవత్వానికి
స్వచ్చమైన వ్యక్తిత్వానికి...ప్రతిరూపమే
ఇదే సకల మానవాళికి లోకకల్యాణానికి గౌతమ బుద్ధుడు అందించేటి శుభసందేశం



