Facebook Twitter
సుభాషితాలు..!సూర్య కిరణాలు..!!

ప్రేమ...త్యాగం..!!

అందాలు చిందే...
ఆమె అధరాలు మధురం
కాళ్ళకు బందాలు వేసే...
ఆ కన్నె వలపే మధురం
ప్రాణాలను సైతం త్యాగంచేసే...
ఆ ప్రేమెంతో మధురం...

అన్న పోలన్న సుభాషితం..!
విన్న మీకు శుభోదయం...!!

ప్రేమకు అర్థం...
తెలియదన్నవాడు బచ్చేరా
ప్రేమించిన పిల్లను...
పెళ్ళాడితే అచ్చేరా
లక్షల కాశపడి మోసం చేస్తే...
వాడికి డబ్బుపిచ్చేరా...

అన్న పోలన్న సుభాషితం..!
విన్న మీకు శుభోదయం...!!

అక్రమ సంబంధాలు..?

బాయ్ ఫ్రెండ్స్ తో సిగ్గిడిసి...
బరితెగించి తిరిగినా
కన్నవాళ్ళ కళ్ళుగప్పి...
కాలు జారినా...కలచెదరినా
బ్రతుకు చితికేనమ్మా...
ఓ బంగారు చెల్లెమ్మా...

అన్న పోలన్న సుభాషితం..!
విన్న మీకు శుభోదయం...!!

కళ్ళు పొరలు కమ్మితే...
ముందు జీవితం ముక్కలేరా
అక్రమసంబంధాల్లో మునిగితేలే
ఓ నక్కల్లారా...గజ్జికుక్కల్లారా...
వావివరసలు లేని మీ కన్నా
ఆ వరహాలే నయం గదరా...

అన్న పోలన్న సుభాషితం..!
విన్న మీకు శుభోదయం...!!