ఆదిశక్తి...అంతరాత్మే..?
తెలిసీ తెలియక
నీవు తప్పు చేస్తే...
అది తప్పు తప్పు అని
ఘోషించేది...అంతరాత్మే...
గొంతు నులిమేది...అంతరాత్మే...
తిరుగు లేని తీర్పు
నిచ్చేది... అంతరాత్మే...
కష్టాల కారాగారాల్లోకి
నెట్టి నీకు కఠినమైన శిక్షలు
విధించే "ఆదిశక్తి"...నీ అంతరాత్మే...
ప్రతి క్షణం హెచ్చరించేది
నీకు గుర్తుచేసేది...అంతరాత్మే
గుండెల్లో చిచ్చు రేపేది...అంతరాత్మే
నీకు న్యాయమూర్తి...నీ అంతరాత్మే...
నీకు అంతులేని ఆనందాన్ని...
ఆత్మబలాన్ని...కొండంత ధైర్యాన్నిచ్చి...
సాహసమే ఊపిరిగా ముందుకు సాగి
పొమ్మనే "స్పూర్తిప్రదాత"...నీ అంతరాత్మే



