లోకం...ఒక "అతిథి గృహం
ఈ జీవితం...
ఒక "పుస్తకమైతే"పఠించక" తప్పదు..!
ఈ జీవితం...
ఒక "నాటకమైతే"నటించక" తప్పదు..!
ఈ జీవితం...
ఒక "రణక్షేత్రమైతే"
"శతృవుల్ని" సంహరించక తప్పదు...!
ఈ జీవితం...
ఒక "జైలైతే" నిన్ను నీవు
"నిర్దోషిగా" నిరూపించుకోక తప్పదు..!
ఈ జీవితం...
ఒక "సంగీతమైతే" సుఖదుఃఖాల
"శృతిలయలు" ఆలపించక తప్పదు..!
ఈ జీవితం...
ఒక "చిక్కు సమస్యైతే చక్కని
"పరిష్కార మార్గాల్ని"వెతక్క తప్పదు..!
ఈ లోకం...
ఒక "అతిథి గృహమైతే"
"ఆత్మనే అద్దెగా " చెల్లించక తప్పదు...!
ఈ జీవితం...
ఒక "సాగరమైతే"
"సాహసంతో" ఈది తీరంచేరక తప్పదు..!
ఇక చాలు నేలపై
నీ నడక "ఆపమన్న"
పరమాత్మ "పిలుపు విన్న"
మరుక్షణమే మరణం...!
పరలోకానికి పయనం..!
ఆపై ఆ పరమాత్మలో లీనం



