ఎక్కబోతే ఎవరెస్టు శిఖరం...?
పాపం వాడి మీద...
ఒక...పెద్ద బండే...పడిందట
వీడి మీద ఒక...చిన్న రాయే..పడిందట
వీడి అదృష్టం...వాడి దురదృష్టం...
పాపం వాడి మీద...
ఒక...పెద్ద కొండే...పడిందట
వీడి మీద ఒక...చిన్న బండే...పడిందట
వీడి అదృష్టం...వాడి దురదృష్టం...
పాపం వాడు...ఎక్కబోతే
ఎవరెస్ట్ శిఖరమే...ఒరిగి మీద పడిందట
వీడి మీద...ఒక చిన్న కొండే...పడిందట
వీడి అదృష్టం...వాడి దురదృష్టం...
అంతా ఆ దైవలీల...
ఏ రోజు ఎవరి నెత్తిన
ఏ పిడుగు పడుతుందో
ఎవరికెరుక ఆ పరమాత్మకు తప్ప...



