సకలగుణ
సంపన్నులంటే ఎవరు...?
సహనం సమయస్ఫూర్తి
సర్దుబాటు గుణం గలవారు..!
మంచితనం
మానవత్వమున్నవారు...
సమయ పాలన ఎరిగినవారు..!
అణువణువునా
అణుకువను నింపుకున్నవారు..!
వినయ విధేయతలు గలవారు..!
ధనవంతులంటే ఎవరు...?
అక్రమంగా దోచుకుని
లాకర్లలో లక్షలు...
బ్యాంకు ఖాతాల్లో
కోట్లు...దాచుకున్నవారు
ఇంట్లో బీరువాల్లో
కట్టుకోని పట్టుచీరలు
పెట్టుకోని బంగారు నగలు...
ఖరీదైన కార్లు బంగళాలు
విలాసవంతమైన
విల్లాలున్నవారు కాదు...
దయా దాక్షిణ్యం ప్రేమ కరుణ
జాలి మూలధనముగా గలవారు..!
అహంకారులంటే ఎవరు..?
ఇరుగుపొరుగు వారు
ఎన్ని ఇబ్బందులు పడుతున్నా
మనసు కరగని కసాయివారు..!
చేయగలి ఉండి సహాయం
చేయ ముందుకు రానివారు..!
చేతులు ముడుసుకునే మూర్ఖులు ..!
దాతలంటే ఎవరు..?
తమకున్నా లేకున్నా
తాముతిన్నా తినకున్నా
ఆకలితో అలమటించే అనాధల
నిరుపేదల ఆకలిని తీర్చేవారు..!
ఆపదలో అండగా నిలిచేవారు.!
అట్టివారే కదా సదా చిరంజీవులు..!
చిరస్మరణీయులు...! ధన్యజీవులు..!
పుణ్యమూర్తులు..! పావన చరితులు..!



