అన్న పోలన్న సుభాషితం..! విన్న మీకు శుభోదయం..!
నావ ఎక్కి నీవు
నడిసంద్రం చేరాక...
తిరిగి చూడకురా
ఇక తీరం చేరేదాక...
గట్టి పట్టుదల ఉన్నవాడే
కదరా కడకు గట్టుకు చేరేది..!
ఎవరెస్టు శిఖరం ఎక్కడం
ఎంతో సులభంరా...
దూకుడమే ఆ శిఖరం నుండి
పరమ దుర్లభంరా...
సాధన చేస్తే...సాహసమే ఉంటే..!
సాధ్యం కానిదేమున్నదిరా జీవితాన..?
