Facebook Twitter
కాదేదీ ప్రగతి కనర్హం..

మహాకవి శ్రీశ్రీ
అన్నాడేనాడో
అగ్గిపుల్ల...
కుక్క పిల్ల...
సబ్బు బిళ్ళ...
గుర్రపు కళ్ళెం...
హారతి పళ్ళెం...
తలుపు గొళ్ళెం...
కాదేదీ కవిత కనర్హమని...

పోలయ్య కవి
కూకట్లపల్లి
పలికేను ఈనాడు...
కుమ్మరి కుండ...
చాకలి బండ ...
కమ్మరి కొలిమి...
మంగలి కత్తి...
మాదిగ డప్పు...
మాల మగ్గం...
కాదేదీ ప్రగతి కనర్హమని...

ఎగిరే ఎర్రజెండా...
ఎత్తిన పిడికిలి...
గుర్జించే గళం...
ఉరుముతూ...
ఉరకలేస్తూ...
ఉద్యమించే...
ఉడుకు రక్తం...
కాదేదీ విప్లవ శంఖం
పూరించడాని కనర్హమని...

ఆకలి కేకలు...
అణచివేతలు...
బానిసత్వాలు...
బలిదానాలు...
నినాదాలు...
నిరసనలు...
ప్రశ్నిస్తూ చేసే...
ప్రాణత్యాగాలు...కావేవీ
ప్రతిఘటనల కనర్హమని...