కవిమిత్రులారా..!
జాగ్రత్త జాగ్రత్త..! జరా జాగ్రత్త..!
లైకులు కొట్టే ముందు...
కామెంట్లు చేసే ముందు...
కాసింత జాగ్రత్త..!
లైక్ చేస్తే ముఖంలో లాఫింగే...
కానీ కాసింత కఠినంగా
కామెంట్లు చేస్తే...
అవి కలం పోట్లే...
ఆపై కంట్లో కన్నీరే...
చిత్తంలో చితిమంటలే...
కొందరు సున్నిత
మనస్కులుంటారు...
చిరుచిరు విమర్శలకే
విలవిల లాడిపోతారు...
విషాదంలో మునిగిపోతారు...
చింతల చీకట్లలో చిక్కుకుంటారు
చేసే సలహాలకు...
ఇచ్చే సూచనలకు...
విమర్శలకు మధ్య...
కళ్ళకు కనిపించని
"సన్నని తెర"ను
అర్థం చేసుకోక ఆవేశంలో
అపార్థం చేసుకుంటే...
కంట్లో కారం చల్లినట్లే...
గుండెలో గునపాలు గుచ్చినట్లే...
సత్సంబంధాలు సమాధిఐనట్లే...
మదిలో మానని గాయం చేసినట్లే...
స్నేహం చెట్టుకు చెదలు పట్టినట్లే...
అందుకే కవిమిత్రులారా..!
లైకులు కొట్టే ముందు...
కామెంట్లు చేసే ముందు...
జాగ్రత్త జాగ్రత్త..! జరా జాగ్రత్త..!!



