ప్రియ మిత్రమా...
జగ్గారావు నేస్తమా...
మందారంలాంటి...
మల్లెపువ్వులాంటి...
గంధపు చెక్కలాంటి...
మంచుముక్కలాంటి...
మీ మంచి
మనసును విప్పి
ఎంతో ఆప్యాయతతో...
ఎంతో అభిమానంతో ...
స్పందించి అందించిన...
తేనె చినుకుల్లాంటి
ప్రేమపూర్వకమైన
మీ చల్లని మాటలు
సెల్లో వింటూవుంటే...
నా తలపై నాలుగు
అక్షింతలు జల్లి
ఆశీర్వదించినట్లుంది...
మీ ప్రోత్సహానికి నాలో
ఉత్సాహం ఉరకలు వేస్తుంది...
అది ఏరులా ఉప్పొంగుతుంది...
నా హృదయం
ఒక సంతోష సాగరమైపోయింది....
సాహితీ మూర్తుల
అమృత హస్తాలతో
సన్మానాలు...ఒక ఎత్తు...
స్వచ్చమైన మంచి
మనసున్న మహరాజుల
మాటల మంత్రాలు...ఒక ఎత్తు...
ఇవి రెండు చిరకాలం
నిలిచిపోయే తీపి జ్ఞాపకాలే...
కల్మషం ఇసుమంతైనాలేని...
అసూయ ఆవగింజంతైనాలేని...
చెక్కుచెదరని మీ అభిమానానికి
చేతులు జోడించి...
శిరసు వంచి నమస్కరిస్తున్న...



