Facebook Twitter
కవి..కి నిర్వచనం..?

కవిత్వమే తన ఊపిరిగా
సాహితీ ప్రయాణం సాగించే
"కవి" అనే రెండక్షరాలు
క...ష్టజీ...వి... అనే
నాలుగు అక్షరాలకు
ముందు వెనుక వుంటూ...

"కష్షజీవి"....అనే శిలను
"కలం" అనే ఉలితో చెక్కితే
తయారయ్యే "సుందర శిల్పమే"
"కవి"అన్నారు మహాకవి శ్రీ శ్రీ...

అట్టి కవీశ్వరుడు
కష్టజీవుల కష్టాల్ని చెవులార వింటూ కన్నీటి గాథల్ని కనులారా తిలకిస్తూ మనసులో
మదనపడి మదనపడి... ఎంతో వ్యధకు ఎంతో బాధకు
ఎంతో వేదనకు ఆవేదనకు గురై...
ఎంతో ఉద్వేగంతో...ఉక్రోషంలో...
ఒక్కోసారి ఉగ్రరూపంతో ఊగిపోతూ...

సాంఘిక సామాజిక సాంస్కృతిక
సాహిత్య సాగర మధనం చేసే వేళ
బాహ్య ప్రపంచంలోకి ఎగజిమ్ముకొచ్చే
అమృతమే......పన్నీటి కవిత్వం
హాలాహలమే...కన్నీటి కవిత్వం

సామాజిక అంశాల
సింహాసనం పై కూర్చొని
ఆథ్యాత్మిక అత్యాధునిక
అరుణోదయ అభ్యుదయ
భావాలతో కరిగిపోయే"కవిరాజు"
నిరంతరం లిఖించేది...
వెచ్చని కన్నీటి ధారల కవిత్వమే...
నిత్యం చూపేది...
తాడిత పీడిత సకల జనుల
సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలే...