నేనెవరనుకొంటిరి
ఎవరని
అనుకొంటిరో
నన్ను మీరు
నేను మీ పోలయ్య
కవి కూకట్లపల్లి...
అలరింతు మిమ్మల్ని
కమ్మని కవితలల్లి...
ఆశీర్వదించండి నన్ను
అభినందనల పూలు జల్లి...
ఆపై సభా వేదికపై
నా కలానికి కీర్తి కిరీటం పెట్టి...
నా కవితా పుత్రికలను
సాహిత్య సింహాసనం పై కూర్చోబెట్టి...
చిరునవ్వుల జల్లుల ప్రసంసా పత్రాన్నిచ్చి
సాహితీమూర్తుల అమృత హస్తాలతో...
ఖరీదైన కాశ్మీర్ శాలువా కప్పి...
మెరిసే అందమైన మెమెంటోతో...
సన్మానం చేసిన...
ఘనంగా సత్కరించిన...
మరిచిపోలేనిది ఆ మధురక్షణం
ఆ తియ్యని జ్ఞాపకం గుండెల్లో ఒక
చిరుదీపమై నిత్యం వెలిగేను కదా...
కవిగా గొప్ప గుర్తింపు దక్కేను కాదా...
సాహితీసేవలో నా జన్మ తరించేను కదా...
నా ఈ కమ్మని కలను నిజం చేసినందుకు
సాహితీమూర్తులకు శతకోటి ప్రణామాలు



