గౌరవనీయులైన
కె.ప్రసాద్ బాబుగారి
సారథ్యంలో రోజూ
మనగడప ముందు వాలే
కోస్తా పత్రిక అంటే అది
ఒక రంగుల రామచిలక...
ఒక అందమైన హరివిల్లు...
ఒక వాస్తవ వార్తల విరిజల్లు...
కోస్తా పత్రికలోని...
ప్రతి శీర్షిక ఆకర్షణీయమే...
ప్రతి వార్త కొత్త ఆలోచనలకు
కొత్త ఆవిష్కరణలకు పునాదే...
ప్రతి అక్షరం వెలిగే ఒక నక్షత్రమే...
ప్రతి పేజీ రమణీయమే కమనీయమే...
ప్రతి వాక్యం వాస్తవాలకు ప్రతిబింబమే...
కోస్తా కోస్తా అంటే...కోపమొస్తే...
ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను
మరచి ప్రజలను మోసం చేస్తే...
అక్షరాల కత్తెరలతో
మీ పీకలు మీ తోకలు కోస్తాం...
అని కాబోలు...అర్థం
కోస్తా కోస్తా అంటే...
రాష్ట్ర పురోభివృద్ధికి
అక్షరాలతో సురక్షితమైన
సుపరిపాలనకు సూత్రాలనందిస్తాం...
అని కాబోలు...అర్థం...
కోస్తా ప్రభ...
ప్రజల పత్రిక
సిగ్గులేని ఈ
సమాజాన్ని
అది నిగ్గదీస్తుంది
నిలదీస్తుంది నిజాలను
నిర్భయంగా నిర్భీతిగా
నిక్కచ్చిగా అందిస్తుంది
చితికిపోయిన
చీకటి బ్రతుకులకు
వెలుగు దీపమౌవుతుంది
తెలుగు రాష్ట్రాలలోని
అన్ని జిల్లాలలో
అన్ని మండలాలలో
వీధి వీధిలో వాడవాడలో
చెత్తలా పేరుకున్న
సమస్యలను సంబంధిత
అధికారుల దృష్టికి తెస్తుంది
వారికి నిద్రలేకుండా చేస్తుంది
పరిష్కారమార్గం వైపు
పరుగులు పెట్టిస్తుంది
కోస్తా ప్రభ పత్రిక...
ప్రజలకు...
ప్రజాప్రతినిధులకు...
ప్రభుత్వానికి...మధ్య
వారధిలా నిలుస్తుంది
ప్రజాస్వామ్య పరిరక్షణకు
పటిష్టమైన పునాదులు వేస్తుంది
అట్టి కోస్తాప్రభ దినపత్రిక
ప్రసాద్ బాబుగారి సారథ్యంలో
పత్రికా రంగంలో
ఒక రారాజుగా...
మరో ఈనాడుగా...
ఒక ధృవతారగా...వెలగాలని
మనసారా కోరుకుంటూ...
ఆ పరమాత్మను ప్రార్థిస్తూ...



