సూర్య చంద్రులు…
ఎరుపెక్కిన
"సూర్యుడు"
ఎవరెస్ట్ శిఖరం
ఎక్కుతున్నాడు...
చల్లని తెల్లని
"చందమామ"
నల్లని మబ్బుల్లో
నక్కుతున్నాడు...
ఓ సన్యాసి...సందేహం...?
ఆ నల్లని ఆకాశంలో
చల్లనిగాలి తాకక సోకక
కురిసేనా...ఏ మబ్బైనా...
అహంకారానికి...
అసూయా ద్వేషాలకు..
కుళ్ళు కుతంత్రాలకు...
పగా ప్రతీకారాలకు...మించి
మనిషిలోఉండేనా...ఏ జబ్బైనా...
సహనం...శాంతం...
సర్దుబాటుగుణం తప్ప
మనసులోని మాలిన్యాన్ని
శుభ్రంచేయునా...ఏ సబ్బైనా...
ఆరోగ్యాన్ని కొనేందుకు...
కోరుకున్న బిడ్డను కనేందుకు...
సరిపోయేనా దాచిన...ఎంత డబ్బైనా...



