విందులు
వినోదకేంద్రాలు
విహారయాత్రలు
విమానాశ్రయాలు
విశ్వవిద్యాలయాలు
సినిమా హాల్స్
షాపింగ్ మాల్స్
రైళ్ళు, బస్సులు
గుళ్ళు, గోపురాలు
చర్చీలు,మసీదులు
సెలూన్లు, కిరాణా షాపులు
చికెన్, ఫిష్,మటన్ షాపులు
వైన్ షాపులు, టీ కొట్లు
ఆటోలు,హోటళ్ళు
బార్లు, రెస్టారెంట్లు
క్లబ్బులు, పబ్బులు,
భవన నిర్మాణాలు,అన్ని
వ్యాపారాలు బందాయే...
వలసకార్మికులకు
ఉపాధి కరువాయే...
బ్రతుకు బరువాయే...
కరోనా వైరస్ వచ్చే
లాక్ డౌన్ తెచ్చే
ఇళ్ళన్నీ జైల్లాయే...
రోడ్లన్నీ నిర్మానుష్యమాయే...
విశ్వమంతా విలవిలలాడిపోయే...
ప్రతి మనిషికి ప్రాణభయమాయే...
అన్నీ షాపులు మూతపడిపోయే....
మూతపడనివి
"మూడే"...
బ్యాంకులు, హాస్పిటల్స్, శ్మశానాలు
మృత్యువుతో పోరాడేది
"ముగ్గురే"...
వైద్యసిబ్బంది...
పోలీసు సిబ్బంది...
పారిశుద్ధ్య కార్మికులు...
కరోనా వచ్చి నేర్పిన
గుణపాఠాలు "ఏడే"...
1...నమస్కారమే గొప్ప సంస్కారమని...
2...పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదని...
3...నాది నాది అనుకున్నదేదీ నీదికాదని...
4...రక్తసంబంధాలు
రాత్రికి రాత్రే రద్దౌతాయని...
5...ఈ సంబంధ బాంధవ్యాలేవీ
శాశ్వతం కాదని...
6...మృత్యువు ముందు
అందరూ సమానమేనని...
7...అపరకుబేరుడైనా
అంత్యక్రియల్లేని అనాధేనని...



