Facebook Twitter
గుంటనక్కలకు గుణపాఠం

ఈ రియల్ ఎస్టేట్ రంగంలో

నిన్నఆ ఇద్దరు ఎంతో మంచిగా

ప్రాణానికి ప్రాణాంగా ఉన్నపార్టనర్సు

నేడు సత్సంబంధాలు సన్నగిల్లాయి

కారణం ఒక్కటే వారిలో ఒకరిని

ఏదో ఒక దుష్టశక్తి ఆవరించడం

ఏవేవో చెత్త సలహాలు ఇవ్వడం

ఆపై అత్యాశ పుట్టడం

అంతా తనకే చెందాలని

దొరికినంత దోచుకోవడం

బ్యాంకులో దాచుకోవడం దాంతో

ఒకరంటే ఒకరికి పడకపోవడం

విద్వేషాలు పెరిగిపోవడం 

ప్రాణమిత్రులే ప్రత్యర్ధులై

బద్ధశత్రువులై పోవడం

కిడ్నాపులు చేసుకోవడం 

కత్తులతో పోడుచుకోవడం

గన్నులతో కాల్చుకోవడం 

గొడ్డళ్ళతో నరుక్కోవడం జరుగుతుంది

అన్నింటికి కారణం

ఆశబోతుతనం అబద్దాలు ఆడడం

మాయమాటలు చెప్పడం

నిన్నఅన్నమాట నేడు తప్పడం

అప్పుడే అపార్ధాల అగ్గి పుట్టి

భాగస్వామ్యం భగ్గుమంటుంది

గుంటనక్కలకు ఒక గుణపాఠం నేర్పుతుంది