బాగా నమ్మించి
నవ్వుతూ నవ్వుతూ
నిన్నునట్టేట ముంచే
నక్కలుంటాయి
పాలకుండలోవిషపు
చుక్కలుంటాయి
కుట్రలు కుతంత్రాలు పన్నే
కుక్కలుంటాయి కాస్త జాగ్రత్త నేస్తమా
ఆకు,ముళ్ళు మీదపడ్డా
ముళ్ళు,ఆకు మీద పడ్డా
అడ్డంగా చిరిగేది ఆకేనని మరువకు
బాస్ మీద అలగకు,వచ్చేబంగారు
అవకాశాలను కాలదన్నుకోకు
అట్లాగని అన్యాయం జరిగితే
చూసీ చూడనట్టు, వినీ విననట్టు
పట్టీ పట్టనట్టు ఉండకు
నీ ప్రవర్తన నచ్చితే నెత్తిన
లేదంటే నేలన,హేళన
కళ్ళముందు అన్యాయం
జరిగితే ఖచ్చితంగాఖండించు
క్షణంసేపు బాధగానే ఉండవచ్చు
లేదా రేపు నీవే దానికి బలికావచ్చు
భారీగా నష్టపోవచ్చుకాస్త జాగ్రత్త నేస్తమా
ఎందుకంటే,నీవున్నది
విషసర్పాల మధ్య
విషపురుగుల మధ్య,
కోరలులేని పులుల మధ్య
కస్సుబుస్సు మనకుండానే
కాటేసే కోడెనాగుల మధ్య
నవ్వుతూ నవ్వుతూ నీకు
నీతులు చెబుతూ వెనుక
లోతుగా గోతులు తవ్వే కోతులమధ్య
నీవున్నది నిన్నువాడుకొని
వదిలేసే నీచుల మధ్య కాస్త జాగ్రత్త నేస్తమా
పూర్తిగా ఎవ్వరినీ నమ్మవద్దు
ఎవరైనా నిన్ను ఇంద్రుడన్నా
శ్రీరామ చంద్రుడన్నాపొంగిపోకు
కొందరి ప్రేమ ఆప్యాయత అభిమానం
అభినందన అంతా బూటకం
నాలుగు రోజుల నాటకం కాస్త జాగ్రత్త నేస్తమా



