Facebook Twitter
వారే అదృష్టవంతులు....

మార్కెట్లో అనుభవం పండిన నిపుణులు
చెప్పింది విని మనం అర్థం చేసుకున్న తర్వాత
మన కళ్ళతో మనం చూసి తృప్తి చెందిన తర్వాత
మన మనసుకు సంపూర్ణంగా నచ్చిన తర్వాత

ఇంకా ఆలస్యం చేస్తే
ఆలోచనలు పరిపరి విధాలుగా పోతాయి
నిముషాల్లో నిర్ణయాలు మారిపోతాయి
పనులు వాయిదా పడిపోతాయి

లేదా అతిగా ఆలోచిస్తే
లేని అనుమానాలు పుడతాయి
సందేహాలు ఎక్కువై ఉక్కిరిబిక్కిరి చేస్తాయి

కాని ముందుచూపు లేని మూర్ఖుల దగ్గర
సగం మాత్రమే తెలిసిన సన్యాసులు దగ్గర
సలహాలు తీసుకోరాదు చాలా నష్టపోతాము

ఏదిఏమైనా ఎవరినుండైనా
సలహాలు స్వీకరించవచ్చు కాని
నిర్ణయాలు మాత్రం మనమే తీసుకోవాలి

పది పుస్తకాలలో చదివినదాని కన్నా
రెండు చెవులతో విన్నదాని కన్నా
రెండు కళ్ళతో ప్రత్యక్షంగా చూసిందే మిన్న

మంచి తరుణం మించిపోయినా
ఆపై ఎంత తపించినా తిరిగి లభించునా చెప్పండి
అందుకే అమృతం విషం కాకముందే
అదృష్టం దురదృష్టంగా మారకముందే, మేల్కొని
అడుగు ముందుకు వేసినవారే అదృష్టవంతులండి