ఉగాది అంటే.
ఊహల్లో తేలేది కాదు
ఉగాది అంటే.
ఉన్నతమైన ఆలోచనలతో
ఉదాత్తమైన భావాలతో
ఉత్తుంగ తరంగమై
ఉజ్వల భవిష్యత్తుకై
ఉల్లాసంగా
ఉత్సాహంగా
ఉరకలు వేస్తూ
ఉయ్యాల జంపాల లూగుతూ
ఉద్రేకానికి
ఉద్వేగానికి లోనుకాకుండా
ఉద్యోగమైనా వ్యాపారమైనా
ఉన్నదాంతో తృప్తి చెందుతూ
ఊరికి ఉపకారిగా
ఉపకారమే ఊపిరిగా ఉంటూ
ఉత్సవాల్లో
ఊరేగింపుల్లో మునిగి తేలేదే
ఉగాది అంటే.
