అవనిలోమనిషి - అడవిలో ఒక మ్రాను
అవనిలోమనిషిగా పుట్టే కంటే
అడవిలో ఒక మ్రానుగా పుట్టినా
అదృష్టమే ఈ జన్మ ధన్యమే
ఒక మ్రానుగా పుడితే
తన్ను ఆశ్రయించిన పక్షులకు
పశువులకు మనుషులకు
నిండైన పచ్చని ఆకులతో
ఎర్రని ఎండలో చల్లని నీడనివ్వవచ్చు
ఒక మ్రానుగా పుడితే
కమ్మని పళ్ళని కాచి
పక్షుల పశువుల మనుషుల
కడుపులనైనా నింపవచ్చు
ఆపదలో ఆదుకోవచ్చు ఆకలి తీర్చవచ్చు
ఒక మ్రానుగా పుడితే
ఇంటికి ఓ గుమ్మంగా,ఓ తలుపుగా,
ఓ కిటికీ గా కూర్చునే ఓ కుర్చీగా
పడుకునే ఓ మంచంగా మారవచ్చు
ఇంటి నిర్మాణంలో ఒక మూలస్థంబమైనిలవవచ్చు
ఒక మ్రానుగా పుడితే
చనిపోయిన మనుషుల శవాలను
కాటికి మోసేందుకు పాడెగా మారవచ్చు
కాటిలో శవాన్ని కాల్చేందు కట్టెల నివ్వవచ్చు
