Facebook Twitter
అంబేద్కర్ వాక్కులు..!

అన్యాయం చేస్తూ 

అవమాన పరుస్తూ 

అసమానతలు పాటిస్తూ 

నీచంగా చూస్తూ 

నిరంకుశంగా ప్రవర్తించే 

వారితోనే నా నిరంతర పోరాటం

సంఘంలో 

సమానత్వం 

విద్య ద్వారానే సాధ్యం 

మనం సాంఘిక 

రాజకీయ హక్కులతో కూడిన 

సమానత్వం కోసం పోరాడాలి 

పోయిన హక్కులు పొందడానికి నివేదనలు ప్రార్ధనలు పనికిరావు పోరాడాలి పోరాడి తెచ్చుకోవాలి

పోరాడితే పోయేదేముంది

మీ బానిసత్వపు సంకెళ్లు తప్ప 

ఎవరైనా నోరులేని మేకల్నే బలిస్తారు 

ఎదురు తిరిగే పులులను కాదు

ఈ కులవ్యవస్థ నిర్మూలించబడడానికి దివ్యమైన మార్గం వర్ణాంతరవివాహాలే

కులమనే విషవృక్షానికి కొమ్మలు 

రెమ్మలు కాండము నరికితే సరిపోదు  

కూకటివేళ్లతో సహా దాన్ని పెకలించాలి