Facebook Twitter
అంబేద్కరా మజాకా..!

  • మనువాదులు...
    రంగులు మార్చే
    ఊసరవెల్లులు...
    వారివి వంచించే
    మాయమాటలు...

    మహర్
    మల్లయోధుడైన
    మన బాబా సాహెబ్
    ఆలోచనలు ఆశయాలు...
    మనువాదపు తుప్పును
    వదిలించే మరఫిరంగులు...

    వారివి
    సనాతన
    సంఘర్షణాత్మక
    చింతనలు...
    మనువాదపు
    కుట్రలు కుతంత్రాలు...

    మహా మేధావి...
    త్యాగశీలి ప్రజ్ఞాశాలి...
    మన బాబా సాహెబ్
    ఆశలు...ఆశయాలు...
    అణగారిన పేదప్రజల
    గుండెల్లో అరుణోదయ
    అభ్యుదయ భావాలను
    వెదజల్లే మానవతా మంత్రాలు...

    వారిది అడుగునున్న
    బడుగు...బలహీన...బహుజన
    వర్గాలను...అధఃపాతాళానికి
    అణగదొక్కే...అగ్రవర్ణ అహంకారం...

    జ్ఞాన సూర్యుడైన
    మన బాబాసాహెబ్ ది...
    బడుగులను...పిడుగులుగా
    మార్చే...అంతులేని ఆత్మగౌరవం...

    గాఢనిద్రలో...
    గాఢాంధకారంలో...
    ఉన్న గబ్బిలాలలో
    చైతన్య జ్వాలలు రేపి...
    విజ్ఞానజ్యోతులుగా మార్చి...



  • స్వేచ్చా...స్వాతంత్ర్యం
    మంచితనం...మానవత్వం
    సమానత్వం...సౌభ్రాతృత్వం
    ఆత్మ గౌరవం...అధికారం
    రెండు రెక్కలుగా...
    విశాల విశ్వంలో గగన వీధుల్లో
    విహంగాలుగా విహరింపజేసిన...

    ఘనుడు...
    త్యాగధనుడు...
    సమతావాది...
    మమతావాది...
    సంఘసంస్కర్త...
    మన బాబా సాహెబ్ అంబేద్కర్...
    ఔను మరి అంబేద్కరా మజాకా...!