అంబేద్కర్ అంటే..?
తాడిత పీడిత బడుగు
బలహీన వర్గాల
బహుజనులకు
ఒక ఆశాకిరణం..!
అంబేద్కర్ అంటే..?
ఒక గొప్ప పాఠకుడు...
ఒక బహుగ్రంధకర్త...
అంబేద్కర్ అంటే..?
విదేశాలలో ఎన్నో
విలువైన పట్టాలు
డిగ్రీలు పొందిన
మొట్టమొదటి...
భారతీయుడు..!
నిమ్న జాతీయుడు..!
అంబేద్కర్ అంటే..?
ఒక అన్వేషి...
ఒక పరిశోధకుడు...
ఒక త్రినేత్రుడు...
ఒక జ్ఞాన సూర్యుడు...
భారత రాజ్యాంగ నిర్మాత..!
అంబేద్కర్ అంటే..?
ఒక విజ్ఞాన గని...
ఒక జ్ఞాన భాండాగారం...
నడిచే ఒక విశ్వవిద్యాలయం..!
అంబేద్కర్ అంటే..?
ఒక సాహస వీరుడు...
ఒక పోరాటయోధుడు..!
అంబేద్కర్ అంటే..?
ఒక నిస్వార్థ
రాజకీయ దురంధరుడు.
ఒక ఉద్యమ నాయకుడు...
ఒక గొప్ప సంఘసంస్కర్త....
ఒక నిష్కలంక దేశభక్తుడు..!
అంబేద్కర్ అంటే..?
ఎన్నో అవమానాల
విషాన్ని దిగమింగిన
గరళకంఠుడు..!
అంబేద్కర్ అంటే..?
ఒక అగ్నిపర్వతం...
ఒక అగ్ని జ్వాల...
ఒక మరఫిరంగి...
ఒక ఒంటరి యుద్ధనౌక..!
అంబేద్కర్ అంటే..?
ఒక ధీశాలి...
ఒక స్నేహశీలి...
ఒక బాహుబలి...
ఒక ఘనుడు...
త్యాగధనుడు...
నీతి నిజాయితీకి
నిలువెత్తు నిదర్శనం..!
అంబేద్కర్ అంటే..?
ఒక ఆశావాది...
ఒక న్యాయవాది...
ఒక సమతావాది...
ఒక మమతావాది...
ఒక అభ్యుదయవాది..!
అంబేద్కర్ అంటే..?
ప్రపంచం మెచ్చిన
ఒక గొప్ప మేధావి..!
ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి..!
అంబేద్కర్ అంటే..?
ఒక విశ్వగురువు...
ఒక విశ్వ విజేత...
ఒక అభినవ
గౌతమ బుద్ధుడు...
ఒక మహావ్యక్తి ఒక మహాశక్తి..!
అంబేద్కర్ అంటే..?
ఒక దీర్ఘదర్శి
ఒక దిక్చూచి.....
ఒక మార్గదర్శి...
ఒక మహర్షి
ఒక కాంతి కిరణం...
ఒక శాంతి శిఖరం...
ఒక దళిత జాతి జ్యోతి..!



