Facebook Twitter
అస్తమించని జ్ఞాన సూర్యుడు డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్…

గంజాయి వనంలో ఓ తులసి మొక్క
మహర్ కులంలో వెలిసిన వేగుచుక్క
దళితుల పాలిటి దైవం దారిచూపే దీపం
అణగారిన పేదప్రజల ఆశాకిరణం...
అందరి బంధువు డా.బి.ఆర్ అంబేద్కర్

నాడు విదేశాలకేగి విద్యనార్జించి
గాఢనిద్రలో ఉన్న
గబ్బిలాలకు,"జ్ఞానబోధ" చేసిన
బావిలోని కప్పలకు
"బ్రతుకు దారి" చూపిన...
కర్ణకఠోరంగా అరిచే కాకులకు
"కోకిల రాగాలు" నేర్పిన...
పూరి గుడిసెలో పుట్టిన
బహుజనులను "పులులుగా" మార్చిన...   జ్ఞాన సూర్యుడు డా.బి.ఆర్ అంబేద్కర్

నాడు మనుధర్మశాస్త్రాన్ని మంటల్లో కాల్చి
రాజ్యాంగాన్ని రక్షణ కవచంగా అందించి
కులవిషవృక్షాన్ని కూకటివేళ్లతో పెకలించి
సాంఘిక దురాచారాల్ని"సమాధి"చేసిన...
సమ సమాజానికి "పునాదులు" వేసిన...
పోరాట యోధుడు డా.బి.ఆర్ అంబేద్కర్

ఓ మా దైవమా మీ స్మరణే మాకు ఓ ప్రేరణ
మీ అడుగుల్లో అడుగులు వేస్తాం ! మీ ఆశయాలకు జీవితాలను అంకితం చేస్తాం
రక్తతర్పణచేసైనా రాజ్యాధికారం సాధిస్తాం